ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పండి: నారాలోకేశ్

రైతు రాజ్యం నిర్మిస్తామని హామీ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం.... రైతులేని రాజ్యం లక్ష్యంగా పాలన చేస్తోందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కారణాలు చూపి పరిహారం ఎగ్గొట్టేందుకు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి.. రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ పర్యటన
గుంటూరు, ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ పర్యటన

By

Published : Dec 6, 2020, 8:17 AM IST

తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు డిసెంబర్‌లో పరిహారమిస్తామంటున్న ప్రభుత్వం..... ఎంతిస్తుందో చెప్పలేకపోతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని నివర్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. చీరాల సమీపంలోని నల్లకాలువను పరిశీలించారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ పర్యటన

వరద ప్రవాహంతో పొలాలు ముంపునకు గురువుతున్నాయని రైతులు లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. కారంచేడులో అన్నదాతలతో ముఖాముఖిలో వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కారంచేడు మండలం తెమిడితపాడు, దగ్గుపాడులో మిర్చి పొలాలను పరిశీలించారు. పంట పూర్తిగా పాడయిందని... ప్రజాప్రతినిధులు, అధికారులు పలకరించిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నంబొట్లవారి పాలెంలో పొగాకు రైతులను పరామర్శించిన లోకేశ్‌.... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ విధానాలతో ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతోందని... లోకేశ్‌ అన్నారు. గాల్లో మేడలు కట్టడం మాని.... ప్రజల్లోకి రావాలని హితవు పలికారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో పర్యటించిన లోకేశ్‌..... పసుమర్రులో మిర్చి పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. వరుస విపత్తులతో కుదేలయ్యామని... ఆదుకునేవారే లేరంటూ రైతులు గోడు వెల్లబోసుకున్నారు.

రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారని వ్యవసాయ మంత్రి కన్నబాబు చెప్పడం దారుణమని లోకేశ్‌ అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని అడ్డుకుని తీరతామని... లోకేశ్ హెచ్చరించారు.


ఇదీ చదవండి

'సీఎం గారు..నా ఇంటిని కూల్చేశారు.. న్యాయం చేయండి'

ABOUT THE AUTHOR

...view details