మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. పెనుమాకలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల ముందు ఓ మాట చెప్పి.. ఇప్పుడు మరోలా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెదేపా హయంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ. 1400 ఉంటే... ఇప్పుడు రూ. 10 వేలకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని నిలదీశారు. ఏ రాష్ట్రంలోనూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదని.. ఏపీలోనే ఈ సమస్య ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇసుక పాలసీ అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. వాలంటీర్లకు జీతాలు పెంచారు.. పింఛను మాత్రం తగ్గించారని ఎద్దేవా చేశారు.
మన రాష్ట్రంలోనే ఈ సమస్య ఎందుకొచ్చింది?: లోకేష్ - nara lokesh tour of mangalagiri news
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. తెదేపా హయాంలో ఇసుక ధర రూ.1400 ఉంటే.. ప్రస్తుతం 10 వేలకు చేరిందని విమర్శించారు.
![మన రాష్ట్రంలోనే ఈ సమస్య ఎందుకొచ్చింది?: లోకేష్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4977145-698-4977145-1573027999057.jpg)
lokesh-tour-in-guntoor-district