ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో 'బాదుడే బాదుడు'.. నిత్యావసరాల ధరలపై లోకేశ్​ కరపత్రాల పంపిణీ

LOKESH: 'బాదుడే బాదుడు' కార్యక్రమలో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గంలోని రత్నాల చెరువు 22వ వార్డులోని ప్రజలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పలకరించారు. వారి సమస్యలపై ఆరా తీశారు. వైకాపా-తెదేపా పాలనలో నిత్యావసరాల ధరలు ఏవిధంగా ఉండేవో తెలిపేలా కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో వారికి వివరించారు. తెదేపా హయాంలో పింఛన్‌ పెంచి ప్రజలను ఎలా ఆదుకుందో తెలిపారు.

LOKESH
LOKESH

By

Published : Jul 27, 2022, 7:37 PM IST

LOKESH: పేద, మధ్య తరగతి కుటుంబాలకు తెదేపా పాలనలో 4వేల రూపాయలు మిగులు ఉంటే, వైకాపా పాలనలో 9వేల రూపాయలు లోటు ఉంటోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణం 22వ వార్డులోని రత్నాలచెరువులో పర్యటించిన ఆయన.. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వైకాపా పాలనలో ప్రజలపై పడుతున్న భారం వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నిత్యావసర ధరలు, చెత్త పన్ను, ఇంటి పన్నులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు.

ఇటీవల మరణించిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రత్నాల చెరువు ప్రాంతంలోని చేనేత మగ్గం షెడ్లను పరిశీలించారు. ప్రతి ఏడాది వర్షాకాలం మగ్గాల్లోకి నీరు రావడం వలన ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని..'నేతన్న నేస్తం' కూడా కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికే అందుతోందని లోకేశ్​ దృష్టికి తెచ్చారు. ఉపాధి లేని సమయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని వాపోయారు. పోలియోతో బాధపడుతున్న తన మూడో కూతురుకు వీల్ చైర్ సాయం చేయాలని రాజేశ్వరి కుటుంబం కోరగా వెంటనే స్పందించిన లోకేశ్.. తెలుగుదేశం పార్టీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చారు.

తెదేపా- వైకాపా పాలనలో నిత్యావసరాల ధరలపై లోకేశ్​ కరపత్రాలు పంపిణీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details