వైకాపాలో చేరతావా.. లేదంటే జేసీబీని పంపమంటావా? అని ఆ పార్టీ ఎమ్మెల్యే మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలను, నేతల్ని బెదిరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో పేద ప్రజలకి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిరుపేదల ఇళ్లు నిబంధనలకి విరుద్ధంగా కూలగొట్టేస్తున్నారని ఆరోపించారు. చట్టాలు- నిబంధనలు పాటించకుండా, అర్ధరాత్రి జేసీబీలతో దశాబ్దాలుగా ఉంటున్న వారి ఇళ్లు కూలగొట్టి పేదల్నినడిరోడ్డున పడేశారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే బాధితులందరికీ పక్కా గృహాలు కట్టిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఇదే అంశంపై గుంటూరు జిల్లా కలెక్టర్కు నారా లోకేష్ లేఖ రాశారు. ఈ విషయమై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం చేయాలని, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపాలని ఆ లేఖలో కోరారు.
lokesh fires on ysrcp: 'నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కూలగొడుతున్నారు'
పేదలకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నిరుపేదల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు.
lokesh fires on ysrcp