ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1000 రోజుల్లో 800 మంది మహిళలపై అత్యాచారం: లోకేశ్ - లోకేశ్ న్యూస్

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 1000 రోజులు అయితే.. ఈ వ్యవధిలో 800 మందిపై అత్యాచారాలు జరిగాయని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

లోకేశ్
లోకేశ్

By

Published : May 2, 2022, 10:02 PM IST

రాష్ట్రంలో గత మూడు రోజులుగా భయాందోళన కలిగించే పరిస్థితులు నెలకొన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరులో జ్యోతిర్మయి గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ దండా ప్రసాద్ పెద్దకర్మ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 1000 రోజులు అయితే.. ఈ వ్యవధిలో 800 మంది పైన అత్యాచారాలు జరిగాయన్నారు. అత్యాచార ఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియని పరిస్థిలో హోం మంత్రి ఉన్నారని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాము గట్టిగా పొరాటం చేయటం వల్లే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు.

ఇదీ చదవండి: జగన్ పాలనలో రాష్ట్రం.. నరకాంధ్రప్రదేశ్​గా మారింది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details