Lokesh on Mangalagiri incident: గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ అధికారులు తొలగించటాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. రోజూ త్రాగునీరు, మజ్జిగ అందిస్తూ వందలాది మంది దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాన్ని తొలగించటం స్థానిక ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టిందని దుయ్యబట్టారు. చలివేంద్రం ఉన్న ప్రదేశంలోనే రేపటినుంచి అన్న క్యాంటీన్ ప్రారంభించి.. రోజుకు రూ.2 కే పేదలకు భోజనం అందించాలని అనుకున్నామని తెలిపారు.
పేదల నోటి దగ్గర కూడు లాక్కునే వైకాపా.. మరోసారి అదే పని చేసింది: లోకేశ్ - లోకేశ్ తాజా న్యూస్
Lokesh: గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ అధికారులు తొలగించటాన్ని తెదేపా నేత నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. పేదల నోటి దగ్గర కూడు లాక్కునే వైకాపా.. మరోసారి అదే పని చేసిందని మండిపడ్డారు.
లోకేశ్
పేదల నోటి దగ్గర కూడు లాక్కునే వైకాపా.. మరోసారి అదే పని చేసిందని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులను పంపి దౌర్జన్యం చెయ్యటం దారుణమని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మంగళగిరిలో అన్న క్యాంటీన్ తెరుస్తాం పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి