పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తిమ్మాపురంలో.. వార్డు మెంబర్‌గా వైకాపా తరపున పోటీ చేయాలని లేకుంటే.. డ్వాక్రా యానిమేటర్‌గా తొలగిస్తామంటూ స్థానిక వైకాపా నేతలు రమాదేవిని బెదిరించడం దారుణమన్నారు. మహిళలకు ఇచ్చే గౌరవం, రక్షణా ఇదేనా అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు భయపడ్డ వైకాపా... ఇప్పుడు రౌడీయిజంతోనైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. రమాదేవిని వేధించిన వైకాపా నేతల్ని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
వైకాపా అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది: లోకేశ్ - జగన్‌పై లోకేశ్ కామెంట్స్
పంచాయతీ ఎన్నికల్లో రౌడీయిజంతోనైనా గెలవాలని వైకాపా నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని తెదేపా నేత లోకేశ్ విమర్శించారు. గుంటూరు జిల్లా తిమ్మాపురంలో.. వార్డు మెంబర్‌గా వైకాపా తరపున పోటీ చేయాలని లేకుంటే డ్వాక్రా యానిమేటర్‌గా తొలగిస్తామంటూ స్థానిక వైకాపా నేతలు మహిళను బెదిరించడం దారుణమన్నారు.
వైకాపా అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది