రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవటం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజుపాలెంలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతోందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులను తిట్టడం, కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై పెట్టుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేవి కావన్నారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కబుర్ల కాలక్షేపం ఆపండి