ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారంలోకి రాగానే.. చేనేత సమస్యలు పరిష్కరిస్తా: లోకేశ్ - ఎన్నికల

మంగళగిరిలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం ఉధృతం చేశారు. పలు వార్డులలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. శాలివాహననగర్​లో కుండలు తయారీ విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. చేనేత సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మంగళగిరిలో ఉధృత ప్రచారంలో నారా లోకేశ్

By

Published : Apr 2, 2019, 4:10 PM IST

అధికారంలోకి రాగానే.. చేనేత సమస్యలు పరిష్కరిస్తా
గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం ఉధృతం చేశారు. పలు వార్డులలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. శాలివాహననగర్​లో కుండలు తయారీ విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. తయారు చేసిన కుండలు ఎక్కడ విక్రయిస్తారు... లాభాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీరల ఆసు విధానాన్ని పరిశీలించారు. చేనేత కార్మికులు వారి సమస్యలను వివరించగా... అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించారు. బాగా చదువుకోవాలని పిల్లలకు సూచించారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details