'2024లో మంగళగిరి నుంచే తెదేపా జెండా ఎగరవేస్తా' - తెదేపా
ఓడిన చోటే మళ్లీ విజయపతాకాన్ని ఎగురవేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనని.. కార్యకర్తల జోలికి ఎవరైన వస్తే వదిలిపెట్టేది లేదన్నారు.
పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని నారా లోకేశ్ కొనియాడారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న లోకేశ్.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనని.. కార్యకర్తల జోలికి ఎవరైన వస్తే వదిలిపెట్టేది లేదన్నారు. 2024లో మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేసి తెదేపా జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.