Lokesh Allegations on Jagan About Chandrababu Cases:జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరిందని.. గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై రోజుకో తప్పుడు కేసు పెడుతోన్న సీఎం జగన్‌కి మానసిక పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరిందని జనం చర్చించుకుంటున్నారని అన్నారు. కక్షతో రగిలిపోతున్న జగన్ నైజం ఏంటో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందని తెలిపారు. సీఎం స్థానంలో ఉండి ఉన్మాదిలా మారి, సీఐడీని వైసీపీ అనుంబంధ విభాగంగా మార్చుకుని.. ప్రతిపక్ష నేతల మీద కేసుల మీద కేసుల పెట్టడం దేశ చరిత్రలో ఎక్కడా చూడ లేదన్నారు. ప్రతిపక్షాన్ని వేధించేందుకు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ.. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని పేర్కొన్నారు.
Lokesh on Jagan: కేసుల నుంచి కుటుంబ రక్షణ కోసమే దిల్లీకి జగన్..: లోకేశ్
చంద్రబాబుపై ఆధారాల్లేని తప్పుడు కేసులు వరుసగా బనాయించడం చూసిన జనం సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. జగన్ వెంటనే వైద్యపరీక్షలు జరుపుకోవాలని కోరారు. జగన్ తీసుకునే దారుణమైన నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటోన్న జగన్ దారుణ పరిస్థితిపై కేంద్రానికి అత్యవసరంగా గవర్నర్ నివేదికలు పంపాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఒక్క రూపాయి అవినీతి జరగకపోయినా కేసు బనాయించారని, వేయని రింగ్ రోడ్డుకు అలైన్మెంట్ మార్చారని అన్నారు. ఇలా ప్రతీ కేసులో ఈ రోజుకీ కూడా ఒక్క ఆధారమూ లేదని అన్నారు.