National Lok Adalat to be held on 12th November: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని జడ్పీ పాఠశాల ఆడిటోరియంలో న్యాయమూర్తి శృతి వింద ఆధ్వర్యంలో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం పై ప్రజల నుంచి విమర్శలు వినిపించాయి. నవంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శృతి వింద గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు వచ్చారు. అయితే కనీసం విద్యుత్తు లేకపోవడంతో లోక్ అదాలత్ కార్యక్రమంలో బ్యాటరీ లైట్ల వెలుతురులోనే ఆమె ప్రసంగించారు. న్యాయ వ్యవస్థకే ఇలాంటి పరిస్థితి రావడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
అంధకారంలో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమం.. అధికార్లపై తీవ్ర విమర్శలు
National Lok Adalat: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం పై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నవంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌కు అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శృతి వింద వచ్చారు. విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో లోక్ అదాలత్ కార్యక్రమన్ని ఓ చిన్న ఛార్జింగ్ లైట్ వెలుతురులోనే కొనసాగించారు. అధికారులు విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు విద్యుత్తు ఏర్పాటు చేయడకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు కేసుల్లో దేశ పౌరుడికి ఆర్థిక స్తోమత ఉన్నా, లేకున్నా సముచిత న్యాయం కల్పించడం కొరకు నేషనల్ సర్వీసెస్ యాక్ట్ చట్టం అమల్లో ఉన్నట్లు శృతి వింద గుర్తు చేశారు. ఇప్పటికీ న్యాయ సేవలు అవగాహన లోపంతో గ్రామాల స్థాయిలో పౌరులు ఇబ్బందులు పడుతున్న కారణంగానే సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు మేరకు జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: