ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్చువల్ పద్దతిలో లోక్ అదాలత్

కరోనా వ్యాప్తి కారణంగా.. కోర్టుల్లో కేసుల పరిస్కారనికి నూతన విధానాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మాచర్లలో వర్చువల్ పద్దతిలో లోక్ అదాలత్ నిర్వహించారు.

By

Published : Oct 17, 2020, 6:36 PM IST

Lok Adalat
Lok Adalat

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపడుతూనే ఉన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా.. కోర్టుల్లో కేసుల పరిష్కారానికి నూతన విధానాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మాచర్లలో వర్చువల్ పద్దతిలో లోక్ అదాలత్ నిర్వహించారు.

ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు వాట్సాప్, బీజె యాప్ సహాయంతో వీడియో కాల్ ద్వారా కేసులు పరిష్కరించారు. సివిల్-1, క్రిమినల్ -46, మనోవర్తి కేసులు 2 పరిష్కారమయ్యాయి. వర్చువల్ లోక్ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి కోరారు. ఏపీపీ జి.వెంకటేశ్వర్లు, లోక్ అదాలత్ సభ్యులు నాగిరెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details