ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్క్​ లేకుండా తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా !

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్​డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ శ్యామూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. మాస్క్​లేకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామన్నారు.

మాస్క్​ లేకుండా తిరిగితే వెయ్యి జరిమానా
మాస్క్​ లేకుండా తిరిగితే వెయ్యి జరిమానా

By

Published : Apr 10, 2020, 6:18 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా నగరంలో కంటైన్మెంట్ జోన్లను 10కి పెంచారు. గుంటూరు పట్టణంలో లాక్​డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. ప్రభుత్వోద్యోగులు ఉదయం 10 గంటల్లోపు కార్యాలయాలకు చేరుకోవాలని... సాయంత్రం 5 గంటల లోపు ఎక్కడా రహదారులపై సంచరించరాదని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఉదయం 9 గంటలోపు కూరగాయలు, నిత్యావసర వస్తువుల కోసం ఒక్కరే రావాలని సూచించారు. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని...లేకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,001 నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా...615 ఫలితాలు నెగెటివ్​గా వచ్చాయి. 51 ఫలితాలు పాజిటివ్​గా నిర్ధరణ కాగా...మరో 334 ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రి ఐసోలేషన్​లో 98 మంది ఉండగా...హోం క్వారంటైన్​లో 838 మంది విదేశాల నుంచి వచ్చినవారున్నారని అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details