ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో లాక్​డౌన్​ కఠినతరం

గుంటూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున పోలీసు యంత్రాం ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రభుత్వం కేటాయించిన పాక్షిక సమయం అనంతరం బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి వెళ్లే రైతులు మాస్కులు, జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశారు.

lockdown running strict in guntur district
గుంటూరు జిల్లా అంతటా లాక్​డౌన్​

By

Published : Apr 10, 2020, 6:09 PM IST

కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా పోలీసులు లాక్​డౌన్​ను కఠినతరం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం కఠిన నిర్ణయం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే పాక్షికంగా అనుమతి ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు నియంత్రించారు. రెడ్​ జోన్​ ప్రాంతాలైతే కర్ఫ్యూ వాతావరణం తలపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత ఆంక్షలతో లాక్​డౌన్​ను అమలు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారికి సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కూలీలు తీసుకెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్​ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details