ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లెలో విస్తరిస్తోన్న కరోనా.. 23 నుంచి లాక్ డౌన్ - lockdown in repalle from 23rd july

గుంటూరు జిల్లా రేపల్లెలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. రేపల్లె నియోజకవర్గంలో పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది.

guntur district
రేపల్లెలో విస్తరిస్తోన్న కరోనా

By

Published : Jul 21, 2020, 11:26 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కోవిడ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. రేపల్లె పట్టణంలో ఒక్కరోజే15 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి నియోజకవర్గంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45 కి చేరాయి. రెండు మరణాలు నమోదయ్యాయి. కేసులు ఉన్న ప్రాంతాలలో రెడ్ జోన్ ప్రకటించారు.

అన్ని రకాల షాపులను పూర్తిగా మూయించారు. కంటైన్మెంట్ లోని ప్రజలకు నిత్యావసరాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. రెడ్ జోన్ లోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు శానిటైజింగ్ చేశారు. కేసులు పెరుగుతున్నందున రేపల్లె పట్టణంలో ఈ నెల 23 నుంచి పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులు తెలిపారు. వ్యాపారస్తులు, ప్రజలు అందరూ లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు.


ఇదీ చదవండిఆస్పత్రుల్లో రోగులకందించే సేవలపై శ్రద్ధ ఏది?: పవన్‌కల్యాణ్‌

ABOUT THE AUTHOR

...view details