కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా గుంటూరు జిల్లా మాచర్లలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. అధికారుల సూచనల మేరకు సోమవారం నుంచి బుధవారం వరకు లాక్డౌన్ విధించాలని నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. గురువారం నుంచి ఆదివారం వరకు పాక్షికంగా ఉంటుందని చెప్పారు. ఈ నాలుగు రోజుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉంటుందన్నారు. కరోనా కేసులు తగ్గే ఈ విధానాన్ని అమలుపరచాలని ఉన్నతాధికారులకు సూచించారు.
మాచర్లలో ఈ నెల 12 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ - guntur district latest lockdown news
కరోనా కేసులు మాచర్లలో విజృంభిస్తున్న కారణంగా పూర్తిస్థాయి లాక్డౌన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. కరోనా తగ్గేంత వరకు లాక్డౌన్ ఉంటుందన్నారు.
సోమవారం నుంచి మాచర్ల లాక్డౌన్