గుంటూరు జిల్లా మంగళగిరిలో రేపటి నుంచి లాక్డౌన్కు సడలింపులు ఇవ్వనున్నారు. మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు సున్నాకు రావటంతో లాక్డౌన్లో సడలింపులివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గ అధికారులతో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సడలింపులో కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. మరో కేసు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వస్త్ర, ఆభరణాలు, పాదరక్షల దుకాణాలు మినహా అన్నింటికి అధికారులు అనుమతులిచ్చారు.
రేపటి నుంచి మంగళగిరిలో లాక్ డౌన్ సడలింపులు - corona cases in mangalagiri
గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా కేసులు సున్నాకు రావటంతో రేపటినుంచి లాక్డౌన్లో సడలింపులు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. వస్త్ర, ఆభరణాలు, పాదరక్షలు మినహాయించి అన్నీ దుకాణాలు తెరవవచ్చని తెలిపారు.
lockdown ezcemption in guntur dst mangalgiri from tommarrow onwards