లాక్డౌన్ కారణంగా మల్లెపూలు సాగు చేసే రైతులకు కష్టాలు ఎదురువుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రైతు సుబ్బయ్య నాలుగు ఎకరాల్లో మల్లెతోట సాగు చేస్తున్నాడు. పంట చేతికొచ్చే సమయానికి కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించారు. దీంతో రవాణా సౌకర్య నిలిచిపోవటంతో పొలంలోనే మల్లెపూలను వదిలేశాడు. లక్షలు ఖర్చు చేసి సాగు చేస్తే..పెట్టుబడి కూడా రాకుండా నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: మల్లెపూలు మట్టిపాలు - మల్లెపూలపై లాక్డౌన్ ఎఫెక్ట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించటంతో మల్లె రైతులకు కష్టాలు ఎదురువుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి లాక్డౌన్ విధించటంతో మల్లెపూలు పొలంలోనే మట్టిపాలవుతున్నాయి.
లాక్డౌన్ ఎఫెక్ట్: మల్లెపూలు మట్టిపాలు