ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన నేరాలు - lock down effect on crime

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించటంతో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవటంతో ఘర్షణలు, హత్యలకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. రాకపోకలు నిలిపివేయటంతో రోడ్డు ప్రమాదాలు కూడా బాగా తగ్గాయి.

Lockdown .. Breakdown for crimes
లాక్‌డౌన్‌.. నేరాలకు బ్రేక్‌డౌన్‌

By

Published : Apr 14, 2020, 8:16 AM IST

లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో ఘర్షణలకు, హత్యలకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. రోడ్లపై వాహనాలు, మనుషుల రాకపోకలు నిలిచిపోవటంతో రోడ్డు ప్రమాదాలు, ప్రమాద మరణాలు బాగా తగ్గాయి. అంతా ఇళ్లలోనే ఉంటుండటంతో దొంగతనాలకు ఆస్కారం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాల్లో అత్యధిక శాతం మద్యం దుకాణాల్లో జరిగినవే. మద్యం అందుబాటులో లేకపోవటంతో.. ఆ మత్తులో జరిగే అనేక నేరాలకూ అడ్డుకట్ట పడింది. గతేడాది మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 10 మధ్య రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నేరాలతో పోల్చితే ఈ ఏడాది అదే కాలవ్యవధిలో జరిగిన వివిధ రకాల నేరాలు గణనీయంగా తగ్గాయి.

నేరం 2019 2020
హత్యలు 43 20
హత్యయత్నాలు 70 26
దాడులు 58 4
ఇతర దొంగతనాలు 25 0
ఇతర కొల్లగొట్టడాలు(రాత్రిపూట) 120 16
అత్యాచారాలు 44 12
మరణాలు సంభవించిన రోడ్డు ప్రమాదాలు 403 120
మరణాలు సంభవించని రోడ్డు ప్రమాదాలు 667 159
  • మరణాలు సంభవించిన రోడ్డు ప్రమాదాలు 70%, మరణాలు చోటుచేసుకొని రోడ్డు ప్రమాదాలు 76% తగ్గాయి.
  • హత్యలు53%, హత్యయత్నాలు 62% తగ్గుముఖం పట్టాయి.
  • సాధారణంగా వేసవిలో దొంగతనాలు అధికం. లాకడౌన్​తో గత 19 రోజుల్లో కేవలం 16 చోటుచేసుకున్నాయి.

ఇదీ చదవండి:

పొరుగు రాష్ట్రాల్లో లారీ కార్మికుల అవస్థలు


ABOUT THE AUTHOR

...view details