ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధిపత్య పోరు.. ఆలయానికి తాళం !

రాజకీయ ఆధిపత్య పోరుతో శ్రీరామ నవమికి ముందు రామాలయానికి తాళం వేసిన ఘటన గుంటూరు జిల్లా కోవెలమూడిలో చోటుచేసుకుంది. రాములవారి కల్యాణానికి ఆటంకాలు సృష్టిస్తూ.. గ్రామ సర్పంచ్ పోలీసుల సాయంతో తాళం వేయించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ ఆధిపత్య పోరు.. రామాలయానికి తాళం !
రాజకీయ ఆధిపత్య పోరు.. రామాలయానికి తాళం !

By

Published : Apr 5, 2022, 7:59 PM IST

Updated : Apr 5, 2022, 9:39 PM IST

రాజకీయ ఆధిపత్య పోరు.. రామాలయానికి తాళం !

రాజకీయ ఆధిపత్య పోరుతో శ్రీరామనవమికి ముందు ఓ గ్రామంలో రామాలయానికి తాళం పడింది. వైకాపా ఆధిపత్య పోరుతో రాములవారి కల్యాణం కోసం పాతిన కడ్డీలను పీకేసి, ఏకంగా రాములవారి ఆలయానికి తాళాలు వేసిన ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో జరిగింది. ఈనెల 10న శ్రీరామనవమి వేడుకలు జరిపేందుకు ఆలయ పెద్దలు సిద్ధమవ్వగా.. వైకాపా సర్పంచి శ్రీను అడ్డుకున్నారు. తాను గ్రామానికి సర్పంచి అని.. తాను మాత్రమే ఈ ఏడాది రాములోరి కల్యాణం జరిపిస్తానని పట్టుబట్టారు. ఈ వివాదానికి సర్పంచి శ్రీనునే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

సర్పంచితో పాటు గ్రామస్థులు కల్యాణంలో దంపతులుగా కూర్చుకుంటారని ఆలయ పెద్దలు చెప్పారు. సర్పంచి కాబట్టి మీరు ముందు కల్యాణం తలంబ్రాలు పోసిన తరువాత మిగతా దంపతులు తలంబ్రాలు పోస్తారని సమస్య పరిష్కారం దిశగా చెప్పినప్పటికీ వైకాపా సర్పంచి అలా కుదరదని తేల్చి చెప్పారు. ఆలయం వద్ద పెద్దలు పందిరి వేసేందుకు ఒక కర్ర పాతారు. దీంతో వైకాపా సర్పంచి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి.. కల్యాణ పందిరి కోసం పాతిన కర్రను తొలగించారు. ఏకంగా రామాలయానికి తాళాలు వేయించి పోలీసు స్టేషన్‌లో ఉంచారు. దీంతో రెండ్రోజులుగా స్వామివారికి ధూప దీప నైవైద్యాలు పెట్టేందుకు కూడా వీలు లేకుండా పోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమిరోజు రాముడికి పూజలు చేసే అవకాశం లేకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి: అన్న ఇంటికి చెల్లి నిప్పు.. ఇద్దరు మేనకోడళ్లు సజీవదహనం

Last Updated : Apr 5, 2022, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details