ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దె చెల్లించటం లేదని గ్రామ సచివాలయ భవనానికి తాళాలు - గుంటూరు జిల్లా గురజాల తాజా వార్తలు

గుంటూరు జిల్లా గురజాలలోని మూడో గ్రామ సచివాలయానికి.. భవన యజమాని తాళాలు వేశారు. రెండు నెలలుగా అద్దె చెల్లించడం లేదనే ఇలా చేసినట్లు ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని.. యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

lock for village secretariat building at gurajala for not paying rents
అద్దె చెల్లించటం లేదని సచివాలయ భవనానికి తాళాలు

By

Published : Mar 2, 2021, 9:08 PM IST

గుంటూరు జిల్లా గురజాలలోని మూడో గ్రామ సచివాలయానికి తాళాలు వేశారు. రెండు నెలల నుంచి సచివాలయ భవనానికి అద్దె చెల్లించనందుకే ఇలా చేసినట్లు.. భవన యజమాని తెలిపారు. కార్యాలయానికి తాళం వేయటంతో.. సిబ్బంది 11 గంటల నుంచి బయటే ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని భవన యజమానితో మాట్లాడారు. రెండు, మూడు నెలల్లో మొత్తం బకాయిలను చెల్లిస్తామని అధికారులు యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం గేటు తాళాలు తీయటంతో.. సచివాలయ సిబ్బంది తమ విధులను నిర్వర్తించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details