కరోనా లాక్ డౌన్.. రోజువారీ కూలీలకు ఉపాధి లేకుండా చేసింది. వివిధ ప్రాంతాల నుంచి గుంటూరు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర దుకాణాల్లో పనిచేసేవారు ఇప్పుడు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు హోటళ్లు తీయనీయటం లేదు. ప్యాకింగ్ చేసి పార్సిళ్లు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించినా... పోలీసులు మాత్రం ఎక్కడా హోటళ్లను తీసేందుకు ఒప్పుకోవటం లేదు. నిబంధనల ప్రకారం సాయంత్రం 7గంటల వరకూ ప్యాకింగ్ చేసిన ఆహారం టేక్ అవే విధానంలో తీసుకెళ్లే అవకాశం ఉన్నా పోలీసులు అనుమతించటంలేదు. ఈ కారణంగా అక్కడ పనిచేసే వారికి ఉపాధి లేకపోవటంతో పాటు తిండి దొరకని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. దాతలు ఎవరైనా వచ్చి ఆహారం పొట్లాలు ఇస్తే అవి తీసుకుని రోజు గడుపుతున్నామని... బయట ఎక్కడ ఉన్నా పోలీసులు వచ్చి వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'ఇంటికైనా పంపించండి.. లేదంటే సౌకర్యాలు కల్పించండి' - labour facing problems in andhra corona
కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. అందులో భాగంగానే లాక్ డౌన్ నిర్వహిస్తున్నారు. ప్రజలను రోడ్డెక్కకుండా చూస్తున్నారు. అయితే లాక్ డౌన్ ప్రభావం రోజు వారి కూలీలపై పడింది. అటు ఇంటికి వెళ్లలేక.. ఉన్న చోట ఉపాధి లభించక అవస్థలు పడుతున్నారు. పనుల్లేని కారణంగా పూడ గడవడం కష్టమవుతోందని ఆవేదన చెందారు.
'మా ప్రాంతాలకైనా పంపించండి లేదా సౌకర్యాలు కల్పించండి'