గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ ప్రభావం కనిపిస్తోంది. వర్తక, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రైల్వేస్టేషన్, బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రార్థనా మందిరాలకు తాళాలు వేశారు. ప్రధాన రహదారులపై ఆటోలు, ద్విచక్రవాహనాల రద్దీ తగ్గింది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో కరోనా నియంత్రణకు ఆలయ పండితులు ప్రత్యేక హోమాలు చేశారు. కరోనా వైరస్ తొలగిపోయి ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యవంతులుగా ఉండాలని కాంక్షించారు. మరోవైపు.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాత్రం లాక్డౌన్ పాటించడంలో నిర్లిప్తత పాటిస్తున్నారు. అలాంటి వారికి పోలీసులు, అధికారులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.
కరోనా ఎఫెక్ట్: గుంటూరు జిల్లా లాక్డౌన్ - all people support lockdown ap due to corona virus/covid-19
గుంటూరు జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ప్రభావం కనిపిస్తోంది. వర్తక, వాణిజ్య సంస్థలు నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన రహదారులపై ఆటోలు, ద్విచక్రవాహనాల రద్దీ తగ్గింది.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా మూతపడిన దుకాణాలు,నిలిచిన వాహనాలు