కరోనా అన్ని రంగాలను.. అన్ని వర్గాలను కుదిపేస్తోంది. చెత్త, వ్యర్థాలను సేకరించి పొట్ట పోసుకునే నిరుపేదల పరిస్థితి మరింత దయనీయం. ప్లాస్టిక్ బాటిళ్లు, అట్టపెట్టెలు, చిత్తు కాగితాలు, పనికిరాని ఇనుప సామాగ్రిని... అవే మహాభాగ్యంగా భావిస్తారీ అభాగ్యులు. కష్టపడి సేకరించే వస్తువుల్ని కిలోల చొప్పున తుక్కు వ్యాపారులకు అమ్ముతుంటారు.
చెత్తగా బతుకీడిస్తున్నారు..
అసంఘటిత రంగంలో వేలాదిమంది చెత్త సేకరణ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. చెత్త సేకరించే వారిలో మూడొంతులమంది నిరక్షరాస్యులే. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఈ వృత్తిని తప్పనిసరి పరిస్థితుల్లో ఆచరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్లపక్కన గుడారాలు వేసుకుని వీరంతా బతుకీడుస్తున్నారు. రోజంతా చెత్తను సేకరిస్తే వారికి మిగిలేది రెండుపూటలా భోజనమే. లాక్డౌన్ వల్ల కొందరు అప్పులు చేసి మరీ ఆకలిమంట తీర్చుకుంటున్నారు.
చెత్తను ముట్టుకుంటే భయం..