మిర్చి కోతల కోసం కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన కూలీలు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏటా మిర్చి కోతల సీజన్లో రాయలసీమ నుంచి కూలీలు గుంటూరు జిల్లాకు వలస వస్తారు. ఈసారి మిర్చి కోతలకు వచ్చిన కూలీలను.. కరోనా లాక్డౌన్ కష్టాలకు గురిచేసింది. సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాలకు వచ్చిన కూలీలు ఎక్కడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తమను సొంతూళ్లకు వెళ్లేలా చూడాలని వారు కోరుతున్నారు. తిరిగి వెళ్లేందుకు తమను సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఆపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. మరిన్ని రోజులు ఇక్కడే ఉండేందుకు వెంట తెచ్చుకున్న సరకులు, బియ్యం అయిపోయాయని, చేతిలో డబ్బులు కూడా లేవని ఆవేదన చెందుతున్నారు. పాలకులు, పోలీసులు తమ సమస్యపై దృష్టి సారించాలని కోరాారు.
కరోనా ఎఫెక్ట్: చిక్కుకుపోయిన వలస కూలీలు
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం వలస కూలీలపై తీవ్రంగా పడింది. రాష్ట్రమంతటా లాక్డౌన్ కొనసాగుతుండగా.. ఎక్కడి ప్రజా రవాణా అక్కడే నిలిచిపోయింది. మిర్చి కోతల కోసం కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన కూలీలు ఆయా గ్రామాల్లో చిక్కుకుపోతున్నారు. అధికారులు స్పందించి తమను స్వస్థలాలకు పంపించాలని వేడుకుంటున్నారు.
కరోనా ఎఫెక్ట్: చిక్కుకుపోయిన వలస కూలీలు