రుణయాప్ నిర్వాహకుల వేధింపులతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానికి చెందిన వివాహిత ప్రత్యూష.. తాను రూపీ ఎక్స్‌ఎం యాప్‌లో రూ.20వేలు రుణం తీసుకున్నానని అందులో రూ.12 వేలు చెల్లించానని తెలిపింది. మిగిలిన డబ్బులు సోమవారం ఉదయం ఏడింటిలోపు చెల్లించకపోతే ఫోటో మార్ఫింగ్ చేసి కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లకు న్యూడ్ ఫొటోలు పంపిస్తామని బెదిరించారని బంధువల వద్ద పరువు పోతుందనే భయంతోనే తాను చనిపోతున్నట్లు చెప్పింది. ఈ మేరకు సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. అనంతరం ఇంటి పైన ఉన్నఇనుప ఫ్లెక్సీ ప్రేమ్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి అమృతరావు ఫిర్యాదుతో మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
దా'రుణ' యాప్‌ల బెదిరింపులు..వివాహిత బలవన్మరణం - రుణయాప్ నిర్వహకుల వేధింపులతో వివాహిత బలవన్మరణం
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో దారుణం చోటుచేసుుకంది. రుణయాప్ నిర్వాహకుల వేధింపులతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. రుణం చెల్లించకపోతే ఫోటో మార్ఫింగ్ చేసి కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లకు న్యూడ్ ఫొటోలు పంపిస్తామని యాప్ నిర్వహకులు బెదిరించారని సెల్పీ వీడియో రికార్డు చేసి తనువు చాలించింది.
దా'రుణ' యాప్‌ల బెదిరింపులు