గుంటూరు జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెం క్వారీలో ఇసుక రవాణా నిలిచిపోయింది. అక్కడ పనిచేసే ముఠా కూలీలు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. జేసీబీలతో లోడింగ్ చేయడం వల్ల తమకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తీసుకెళ్లే లారీలకు ట్రాక్టర్ అడ్డు పెట్టి ఆందోళనకు దిగారు.
గతంలో ఇసుక క్వారీల్లో పనిచేసుకునేవాళ్లమని కూలీలు గుర్తు చేశారు. ఇపుడు యంత్రాలు రాకతో తమకు ఉపాధి కరువైందన్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో.. మంచినీటి సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.