గుంటూరు జిల్లా నరసరావుపేటలో లిక్కర్ కార్మికులు సమ్మె చేశారు. రాష్ట్రంలోని ఐఎంఎఫ్ఎల్ మద్యం డిపోల్లో పనిచేసే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ నినాదాలు చేశారు. లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీలు పెంచాలని.. కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం వేతనంగా రూ. 18 వేలు ఇవ్వాలని కోరారు.
నరసరావుపేటలో లిక్కర్ కార్మికుల సమ్మె
గుంటూరు జిల్లా నరసరావుపేటలో లిక్కర్ కార్మికులు సమ్మె చేశారు. మద్యం డిపోల్లో పనిచేసే కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు.
నరసరావుపేటలో లిక్కర్ కార్మికుల సమ్మె