ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండగ చేసుకున్న మందు బాబులు - మాచర్లలోని మద్యం దుకాణాల న్యూస్

మందుబాబులకు ఇదో పండగ రోజులా మారింది. లాక్​డౌన్​తో ఇంతకాలం అందుబాటులో లేని మద్యం ఇప్పుడు వారిని రా రమ్మని పిలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో లాక్​డౌన్​ నిబంధనల సడలింపులతో మద్యం దుకాణాలు ఈరోజు తెరుచుకున్నాయి. ఇన్నాళ్లు ఓపిక పట్టిన మందు ప్రియులు ఎండను లెక్కచెయ్యకుండా రోడ్లపై బారులు తీరారు.

రమ్మని పిలుస్తున్న మద్యం దుకాణం
రమ్మని పిలుస్తున్న మద్యం దుకాణం

By

Published : May 4, 2020, 6:26 PM IST

గుంటూరు జిల్లాలో 155 మద్యం దుకాణాల్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే దుకాణాల వద్ద జనం బారులు తీరారు. కరోనా ప్రభావిత కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న 125 దుకాణాలు తెరుచుకోలేదు.

గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, పొన్నూరు, నకరికల్లు ప్రాంతాల్లో దుకాణాలను అధికారులు తెరవలేదు. కొన్నిచోట్ల ధరలు అప్​డేట్​ కాక... మరికొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో అమ్మకాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

తొలిరోజు కావడం వల్ల అక్కడక్కడా సమస్యలు తలెత్తుతున్నాయని అబ్కారీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్​ తెలిపారు. మద్యం కొనుగోలు సందర్భంగా... వినియోగదారులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:

మందుబాబుల్లో హుషారు.. దుకాణాల ముందు జోరు

ABOUT THE AUTHOR

...view details