గుంటూరు జిల్లా పరిధిలోని నకరికల్లు రహదారిపై పాల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలోని నల్గొండ నుంచి నరసరావుపేట వెళుతున్న తిరుమల పాల వాహనంలో ఈ మద్యాన్ని పోలీసులు గుర్తించారు.
72 వేల రూపాయలు విలువ చేసే 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టుగా ఎస్సై పి. ఉదయబాబు తెలిపారు. వాహన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.