ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

liquor seized: భారీగా మద్యం పట్టివేత.. - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా(Guntur district)లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు(liquor seized). పట్టుబడిన మద్యం రూ.4.38 లక్షల విలువ చేస్తుందన్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

liquor seized
liquor seized

By

Published : Oct 25, 2021, 8:44 AM IST

గుంటూరు జిల్లా(Guntur district) పొందుగుల చెక్​పోస్ట్ వద్ద దాచేపల్లి పోలీసులు భారీగా మద్యాన్ని(liquor seized) పట్టుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తెలంగాణ నుంచి సిమెంట్ లారీలో అక్రమంగా మద్యం తరలిస్తున్నరన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

వాహన తనిఖీల్లో భాగంగా లారీని ఆపి నిశితంగా పరిశీలించారు. అందులో ఉన్న 63 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం లక్షల విలువ రూ.4.38 చేస్తుందన్నారు. లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పరారయ్యాడన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

sexual assault: గురువు అసభ్య ప్రవర్తన.. అశ్లీల చిత్రాలు చూపిస్తూ...!

ABOUT THE AUTHOR

...view details