ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వనస్థలిపురం నుంచి మద్యం సరఫరా.. ముగ్గురు అరెస్ట్, 576 సీసాలు స్వాధీనం - timmapuram latest news

గుంటూరు జిల్లా తిమ్మాపురం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 576 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి.. ఆటోను సీజ్ చేశారు.

liquor seized in guntur district
భారీగా మద్యం పట్టివేత ... ముగ్గురు అరెస్టు

By

Published : Mar 17, 2021, 10:38 AM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గుర్తించారు. 576 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రూ.70,000 ఉంటుందని అంచనా వేశారు. ముగ్గురిని అరెస్టు చేసి.. ఆటోను సీజ్ చేశారు.

నాదెండ్లకు చెందిన ఒక వ్యక్తి గత కొన్ని నెలలుగా హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పార్సిల్​లో మద్యం అక్రమంగా తీసుకువచ్చి.. యడ్లపాడు, తిమ్మాపురం, నాదెండ్ల ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా నిఘా పెట్టి.. మంగళవారం సాయంత్రం జాతీయ రహదారి నుంచి తిమ్మాపురం గ్రామానికి ఆటోలో తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details