గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆర్టీసీ బస్టాండ్ పక్క వీధిలోని సాయి గణేష్ టవర్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న న్యాయవాది మల్లాది నిరంజన్ బాబు ఇంట్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
న్యాయవాది ఇంట్లో దాడులు.. రూ.75 వేలు విలువ చేసే మద్యం పట్టివేత - Guntur district news
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో నివాసముంటున్న మల్లాది నిరంజన్ బాబు అనే న్యాయవాది ఇంట్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.75 వేలు విలువ చేసే 5 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్ చేశారు.
మద్యం పట్టివేత
అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో రూ.75 వేల విలువ చేసే 5 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తులో నరసరావుపేటకు చెందిన వారి వద్ద నుంచి అతనికి మద్యం సరఫరా అయినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాలు, రాజధాని రైతుల అరెస్ట్
Last Updated : Aug 2, 2021, 4:50 PM IST