లాక్‌డౌన్ సమయంలో 2 నెలలు మద్యం దుకాణాలు మూసివేసిన అధికారులు.. తిరిగి వాటిని తెరిచే ముందు సరకు నిల్వలు తనిఖీ చేశారు. జిల్లాలోని తెనాలి, మాచర్ల, నగరం, నరసరావుపేట తదితర స్టేషన్ల పరిధిలోని 21 దుకాణాల నుంచి రూ.50 వేల చొప్పున.. కొన్ని దుకాణాల్లో అయితే అంతకుమించి మద్యం మాయమైనట్లు గుర్తించారు. మరో 20 పైగా దుకాణాల్లో చిన్న మొత్తాల్లో మద్యం తరలిపోయినట్లు తేల్చారు. దీనికి దుకాణ పర్యవేక్షకులను బాధ్యులను చేసిన అధికారులు, వారి నుంచి సంబంధిత మొత్తాలను రికవరీ చేశారు.
ఇదంతా ఎలా జరిగింది?
ప్రభుత్వ దుకాణాల నుంచే మద్యం మాయమవడానికి కారణాలపై నేటికీ సమగ్ర సమీక్ష జరగకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. పలు దుకాణాల్లో ఖరీదైన మద్యం, ఫుల్ బాటిల్స్ తదితరాలను వచ్చినవి వచ్చినట్లే దాచేసి విడిగా అమ్ముతున్నారని, అధిక ధర తీసుకుంటున్నారంటూ గొడవలు జరిగాయి. అంతేకాకుండా నిబంధనల మేరకు ఒకరికి 3 సీసాలే ఇవ్వాల్సి ఉండగా, కేసుల కొద్దీ బయటకు తరలడం మొదలైంది. ఈ క్రమంలో అధికారులు జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 44 మంది సిబ్బందిని అరెస్ట్ చేసి, విధుల నుంచి తొలగించారు.
రాత్రి 7 తర్వాత విక్రయాలు
ప్రభుత్వ మద్యం దుకాణాలు రాత్రి 7 గంటలకు మూసి వేస్తున్నారు. సిబ్బంది ద్వారా, ఇతర మార్గాల్లో వెలుపలికి వచ్చిన మద్యం ఆ తర్వాత నల్లబజారులో విచ్చలవిడిగా దొరుకుతోంది. గతంలో రూ.100 ధర ఉండే మద్యాన్ని ప్రభుత్వం రూ.200 చేస్తే, నల్లబజారులో రూ.350కు పైగా పలుకుతోంది. ఫలితంగా మద్యానికి అలవాటుపడిన పేద, మధ్య తరగతి వర్గాలు దోపిడీకి గురవుతున్నారు.
మాఫియాగా రూపొందుతోందా!