గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఈబీ పరిధిలో.. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 8లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ డి.ఎన్ మహేష్, ఈఎస్ అన్నపూర్ణ, మంగళగిరి ఎస్ఈబీ సీఐ మామయ్య బాబు సమక్షంలో.. 2488 మద్యం బాటిల్స్‌లోని 436.05 లీటర్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన 1174 మంద్యం బాటిల్స్‌లోని 387.25 లీటర్ల మద్యంను ధ్వంసం చేశారు. ఏడాది కాలంలో ఈ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
LIQUOR DESTROYED: మద్యం పట్టారు.. ధ్వంసం చేశారు - గుంటూరు జిల్లాలో మద్యం ధ్వంసం వార్తలు
Liquor: గుంటూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ.. మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. మొత్తం 3,662 మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.
LIQUOR DESTROYED