Peddagattu Jathara From Today: తెలంగాణలోని సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై కొలువైన యాదవుల ఆరాధ్య దైవం "లింగమంతుల స్వామి" జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండెళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క తరువాత రెండో అతిపెద్దదిగా లింగమంతుల స్వామి జాతర గుర్తింపు ఉంది.
ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు కర్ణాటక నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది 15 నుంచి 20 లక్షల మేర భక్తులు జాతరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారిని దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.