పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లాలోని ముక్త్యాల, వేదాద్రి, రవిరాల క్షేత్రాల వద్ద నీటిమట్టం పెరిగి ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. పులిచింతల ప్రాజెక్టుకు 3.6 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండగా...16 గేట్లు ఎత్తి 3.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 45.77 టీఎంసీల సామర్థ్యం ఉండగా... ప్రస్తుతం 39 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి ఉద్ధృతి పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
పులిచింతల నుంచి భారీగా నీరు విడుదల
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి పులిచింతలకు 3.6 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 16 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.
Pulichintala project