Driving License Suspended : తెలంగాణలోని హైదరాబాద్‌లో గడిచిన రెండేళ్లలో 8,418 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ సంయుక్త కమిషనర్ పాండురంగ నాయక్ స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అందుకే 2021లో 2,599 లైసెన్స్‌లను సస్పెండ్ చేశామని అన్నారు. 2022లో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య దురదృష్టవశాత్తు రెట్టింపు అయ్యిందని చెప్పారు. 2022లో 5,819 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.
2021లో సస్పెండ్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లు..
- హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో 770 డ్రైవింగ్ లైసెన్స్ లు
- నార్త్ జోన్ పరిధిలో 435 డ్రైవింగ్ లైసెన్స్‌లు
- ఈస్ట్ జోన్ పరిధిలో 284 డ్రైవింగ్ లైసెన్స్‌లు
- సౌత్ జోన్ పరిధిలో 556 డ్రైవింగ్ లైసెన్స్‌లు
- వెస్ట్ జోన్ పరిధిలో 554 డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ ప్రకటింది.