ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలిచిన ఎగుమతులు... నష్టాల్లో నిమ్మ రైతులు - agriculture in guntur district

గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లోని నిమ్మ రైతులు వరుసగా రెండో ఏడాదీ నష్టాలు చవిచూస్తున్నారు. కరోనా కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో నిమ్మ పంటను కోయకుండా అలాగే వదిలేశారు.

lemon farmers problems with corona in tenali
తెనాలిలో నిమ్మరైతుల తిప్పలు

By

Published : May 14, 2021, 5:13 PM IST

నిమ్మ పంటలకు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల రైతులు వరుసగా రెండో ఏడాదీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కరోనా కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మరోసారి ఆ మహమ్మారి విజృంభించటంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులంతా ఆందోళనలో ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు ఇక్కడ్నుంచే నిమ్మ ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఎక్కడికక్కడ కరోనా ఆంక్షలు ఉండటంతో పంట అంతా తోటల్లోనే ఉండిపోయింది.

ABOUT THE AUTHOR

...view details