కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా గుంటూరులో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు స్థానిక బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని మోడీ అన్నదాతల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టాలను ఆహార ఉత్పత్తులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది తప్ప... రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.
దిల్లీ రైతులకు సంఘీభావంగా వామపక్ష నేతల నిరసన - గుంటూరులో వామపక్ష పార్టీలు నిరసన
దిల్లీ రైతులకు సంఘీభావంగా గుంటూరులో వామపక్ష నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
దిల్లీ రైతులకు సంఘీభావంగా వామపక్ష నేతలు నిరసన