Left Parties Protest : పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో వామపక్షాలు నిరసన తెలిపాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం.. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి.. సామాన్యులపై భారం మోపిందని నేతలు మండి పడ్డారు. ప్రైవేటు రంగాల భవిష్యత్తు కోసం సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకోవటం సరికాదని సీపీఎం మండల కార్యదర్శి గంగయ్య అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష నేతలు పాల్గొన్నారు.
పెరిగిన ధరలను నిరసిస్తూ.. వామపక్షాల నిరసన - rising oil and cooking gas prices in ap
Left Parties Protest : పెరిగిన చమురు, వంటగ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లాలో వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం.. ధరలను పెంచి.. సామాన్యులపై భారం మోపిందన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నేతలు హెచ్చరించారు.

వామపక్షాల నిరసన