అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన... గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కొత్తూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొర్ర బాలు నాయక్‌కు ఐదెకరాల సొంత పొలం ఉంది. దానికి తోడు ఏడెకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పంట నష్టం వాటిల్లి అప్పులు పెరగడంతో రాత్రి సమయంలో తన పొలంలో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో బాలు నాయక్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగామధ్యలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మ హత్య - పురుగుల మందు తాగి మాచర్లలో కౌలు రైతు ఆత్మ హత్య
గుంటూరు జిల్లా మాచర్లలోని కొత్తూరులో విషాదం నెలకొంది. అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మ హత్య Leasehold farmer killed by drinking insecticide in macharala at guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8558592-1050-8558592-1598427979112.jpg)
పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మ హత్య