ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. దుగ్గిరాల ఎంపీపీ పీఠం తెదేపాదే'

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు జారీ చేసిన విప్ పత్రాలను గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు అందజేశారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎంపీపీ పీఠం తెదేపాదేనని ధీమా వ్యక్తం చేశారు.

గూడూరు వెంకట్రావు
గూడూరు వెంకట్రావు

By

Published : Sep 23, 2021, 4:57 PM IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ జారీచేసిన విప్ పత్రాలను గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్ ప్రసాద్​కు ...పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు అందజేశారు.

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు జరిపినా.. ఎంపీపీ పదవిని తెదేపా కైవసం చేసుకుని తీరుతుందని వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ముస్లిం మహిళను మండల అధ్యక్షురాలుగా ఎంపిక చేస్తుంటే వైకాపా నాయకులు ఎందుకు ఓర్చుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. పూర్తి మెజారిటీ తెదేపాకు ఉన్నా.. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్ని రకాలుగా అడ్డుపడుతున్నారని విమర్శించారు. తమ అభ్యర్థికి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి తహసీల్దార్ నిరాకరించడం దారుణమన్నారు. వైకాపా నాయకులకు మెజార్టీ లేకపోయినా... ఎలా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారని ప్రశ్నించారు. కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వకుండా రిజెక్ట్ చేసినంత మాత్రాన అధికార పీఠాన్ని తెదేపా దక్కించుకోవడాన్ని అడ్డుకోలేరని తెలిపారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

ఇదీ చదవండి:కొప్పర్రు ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

ABOUT THE AUTHOR

...view details