ఇసుక వ్యాపారంపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులందరినీ... ప్రభుత్వం ఆదుకోవాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు వినూత్నంగా నిరసన చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో... గడియార స్తంభం, చిన్న మసీదు, ఎన్జీవో హోం సెంటర్ దగ్గర... బస్సుల్లో తువ్వాల చాపుతూ భిక్షాటన చేశారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెంటనే స్పందించి కార్మికులను ఆదుకోవాలని నాయకులు కోరారు. అనంతరం డీఎస్పీ విజయ భాస్కర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకుల భిక్షాటన
ఇసుకపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులను... ప్రభుత్వం ఆదుకోవాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు భిక్షాటన చేశారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకుల భిక్షాటన