AP High Court Lawyers Joint Action Committee protest: ఏపీ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ.. హైకోర్టు వద్ద భారీ ర్యాలీ నిర్వహించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, డి.రమేష్ల బదిలీ నిలుపుదల చేయాలంటూ న్యాయవాదులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. హైకోర్టులో భోజన విరామ సమయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ..న్యాయవాదులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పటికే గవర్నర్ను కలిసి బదిలీలపై మెమోరాండం ఇచ్చారు. రెండు రోజుల్లో రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రిని, హోం శాఖ మంత్రిని కలవనున్నట్లు కమిటీ వెల్లడించింది.
న్యాయమూర్తుల బదిలీలు నిలిపివేయాలంటూ.. హైకోర్టు న్యాయవాదులు భారీ ర్యాలీ - lowers protests
AP High Court Lawyers protest: న్యాయమూర్తుల బదిలీలను నిలిపేయాలంటూ.. ఏపీ హైకోర్టు న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.
![న్యాయమూర్తుల బదిలీలు నిలిపివేయాలంటూ.. హైకోర్టు న్యాయవాదులు భారీ ర్యాలీ AP Lawyers Joint Action Committee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17138685-567-17138685-1670416182271.jpg)
ఏపీ న్యాయవాదుల జాయింట్ కమిటీ
ఏపీ హైకోర్టు న్యాయవాదుల భారీ ర్యాలీ
Last Updated : Dec 7, 2022, 7:03 PM IST