మూడు రాజధానుల చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన రిట్ పిటిషన్లపై విచారణ 27న జరగనుందని న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అన్నారు. స్టేటస్‌కో విధించిన అనంతరం శుక్రవారం ఆయా కేసులు త్రిసభ్య కమిటీ ముందుకు వచ్చాయన్నారు. అయితే టెక్నికల్ సమస్య తలెత్తటంతో విచారణను 27న చేపట్టనుందని తెలిపారు. దిల్లీ నుంచి హాజరుకావాల్సిన న్యాయవాదులు ఆన్‌లైన్‌లో కాకుండా ప్రత్యక్షంగా సబ్మిట్ చేయాలని కోరిన నేపథ్యంలో విచారణను వాయిదా వేసినట్లు తెలిపారు. మొత్తంగా 65 కేసులు ధర్మాసనంలో ఉన్నాయని, వీటన్నింటికి సమయం కేటాయించి 27న విచారణ జరపనున్నారని తెలిపారు.
'ఈ నెల 27 వరకు మూడు రాజధానులపై స్టేటస్‌కో' - news on three capitals
ఈ నెల 27 వరకు మూడు రాజధానులపై స్టేటస్‌కో కొనసాగనుందని న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అన్నారు. టెక్నికల్ సమస్య తలెత్తటంతో హైకోర్టు విచారణను 27న చేపట్టనుందని తెలిపారు.
న్యాయవాది నర్రా శ్రీనివాసరావు