గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొవిడ్ మృతదేహాల తరలింపునకు స్ఖానిక మున్సిపాల్ అధికారులు ఏర్పాటు చేసిన రెండు ఉచిత వాహనాలను... ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మృతదేహం పట్టణంలోని ఏ ప్రాంతంలో ఉన్నా కేవలం ఒక ఫోన్ చేస్తే.. సిబ్బంది అక్కడికే వచ్చి మృతదేహాన్ని ఉచితంగా స్మశానవాటికకు తరలిస్తారని… ప్రభుత్వం తరఫున ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహిస్తారని తెలిపారు.
కరోనా మృతులను తరలించే వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - నరసరావుపేలో కరోనా మృతదేహాల తరలింపుకు ఉచిత వాహనాలు
కరోనా మృతదేహాల తరలింపునకు నరసరావుపేటలో రెండు ఉచిత వాహనాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రారంభించారు. పట్టణంలో కరోనా సెకెండ్ వేవ్ ఉద్ధృతి అధికంగా ఉన్నందునా... పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

evacuation of covid diedbodies vehicle lauch in guntur
మృతదేహాల తరలింపునకు వాహనాలు అవసరమైన వారు 9440667821, 8328389288 నెంబర్లకు ఫోన్ చేసి సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి.. కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు ఆర్థిక సాయం