ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికులపై పోలీసు 'లాఠీ' కాఠిన్యం - వలస కార్మికులపై పోలీసుల లాఠీఛార్జ్

గుంటూరు జిల్లా తాడేపల్లి వారధి వద్ద వలస కార్మికులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వలస కార్మికులు ఉండేందుకు వసతి ఏర్పాటు చేసినా, వారంతా స్వస్థలాలకు బయలుదేరటంపై పోలీసులు కోపోద్రిక్తులయ్యారు.

lati charge on migrate workers
వలస కార్మికులపై లాఠీఛార్జ్

By

Published : May 16, 2020, 9:56 AM IST

వలస కార్మికులపై లాఠీఛార్జ్

విజయవాడ క్లబ్​లో వసతి కల్పించినప్పటికీ వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతుండటంతో పోలీసులు కన్నెర్ర జేశారు. విజయవాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరుకున్న వలస కార్మికులపై లాఠీఛార్జ్ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాల మేరకు వలస కూలీలను విజయవాడ క్లబ్​కు తరలించారు. అయితే, వారికి అల్పాహారం అందజేసే క్రమంలో కూలీలంతా స్వస్థలాలకు వెళ్లేందుకు సైకిళ్లపై బయలుదేరారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి వారధి వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డగించి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టటంతో భయంతో పరుగులు తీశారు.

ఇదీ చదవండి:వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైలు

ABOUT THE AUTHOR

...view details