తెలంగాణలోని నల్లగొండ జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యంపై ఎస్ఈబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసున్నారు. వారి వద్ద నుంచి 2304 లిక్కర్ బాటిళ్లు, కారు, ట్రక్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు.
గుంటూరు జిల్లా తుమ్మలచెరువు, కరాలపాడు, పెదగార్లపాడు, చినగార్లపాడు నాలుగు రోడ్ల కూడలి వద్ద ఎస్ఈబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.